రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

● కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌

కోరుట్ల: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని శనివారం సందర్శించారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. విధులపై నిర్లక్ష్యం వహి స్తే చర్యలు తప్పవన్నారు. ఆర్డీవో జీవాకర్‌ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పాల్గొన్నారు.

కోతుల బెడద తీవ్రంగా ఉంది

కోరుట్లరూరల్‌: కలెక్టర్‌ కల్లూర్‌ శివారులోని కస్తూరి బా గాందీ పాఠశాల, కళాశాలను సదర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో కోతులబెడద తీవ్రంగా ఉందని, గుంపుగా రావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారని ప్రిన్సిపాల్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. పరిసరాల్లో చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. సర్పంచ్‌ చిట్నేని లత, వనతడుపుల అంజయ్య పాల్గొన్నారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

జగిత్యాల: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పరిపాలన పర్యవేక్షణలో వైఫల్యం, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన కోరుట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సునీతరాణిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ ఏరియా ఆస్పత్రిని సందర్శించగా.. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. సగం సిబ్బందికి ఒకేసారి సెలవు మంజూరు చేసినట్లు తెలుసుకున్నారు. క్రమశిక్షణ చర్యలు ముగిసే వరకు సస్పెన్షన్‌ అమలులో ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement