నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమివ్వాలి

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

పెగడపల్లి: జలసిరి పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తూ పథకాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని నంచర్ల గ్రామంలో జరుగుతున్న ఫాంపాండ్‌ పనులను సర్పంచ్‌ కుంటాల వనజ, అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో జలసిరి, వీబీజీరామ్‌జీ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. వీబీజీరామ్‌జీ పథకం నిధులు సమర్థవంతంగా వినియోగిస్తూ సాధ్యమైనంత మేరకు కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించాలన్నారు. జలసిరి పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఈవో గౌతమ్‌రెడ్డి, డీఆర్డీవో రఘువరణ్‌, ఆర్డీవో మధుసూదన్‌, డీఎల్‌పీవో విమల, డీఈ అశ్విన్‌, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్‌, తహసీల్దార్‌ సయ్యద్‌ నిజామొద్దీన్‌, ఏపీవో అనిల్‌, ఉప సర్పంచ్‌ శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement