● ఆస్తులు తీసుకుని గెంటేస్తున్న సంతానం ● పెరుగుతున్న అనుమానాస్పద ఆత్మహత్యలు
● మల్యాలకు చెందిన ఓ వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆమె కుమారులు ఏకంగా ఆర్డీవో కార్యాలయంలోనే వదిలిపెట్టి వెళ్లారు.
● విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు కూడా తల్లిదండ్రులు భారమవుతున్నారు. జగిత్యాలలోని ధర్మపురికి చెందిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులను పోషించకపోవడంతో నేరుగా వారు ఆర్డీవో కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.
జగిత్యాలకు చెందిన రాజవ్వ అనే వృద్ధురాలిని ఆమె కుమారులు వృద్ధాప్య పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని దాడిచేయడంతో కాలు విరిగింది. మానవత్వం లేకుండా మోతె శ్మశాన వాటికలో వదిలేశారు.
రాయికల్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు తన కూతురికి ఆస్తిని గిఫ్ట్‌డీడ్ చేయగా.. ఆస్తిని అనుభవిస్తున్న కూతురు తనకు పోషణ ఖర్చులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో ఆ గిఫ్ట్‌డీడ్ రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
వృద్ధులు సైబర్ మోసాలకూ గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాకు ఓ వ్యక్తి లింక్ చేసుకుని వృద్ధుడికి తెలియకుండా మొబైల్ నంబరు లింక్ చేసుకుని వచ్చిన పెన్షన్ డబ్బులను సుమారు రూ.18 లక్షలు డ్రా చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు.


