● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 85 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.29లక్షలు, 93 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందించారు. పట్టణ ప్రజలు తడి, పొడి చెత్త వేరుగా ఇవ్వాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు దామోదర్‌రావు, సందీప్‌రావు, మాజీ జెడ్పీటీసీలు పెండెం రాములు, ఎల్లారెడ్డి, నాయకులు ముకుందం, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రం ప్రారంభం
రూరల్ మండలం అంతర్గాంలో అంగన్వాడీ కేంద్రం–2 భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలకు కేంద్రాలు దోహదపడుతున్నాయన్నారు. సర్పంచ్ నోముల రమ్య, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ హకీమ్, సీడీపీవో పాల్గొన్నారు. సారంగాపూర్ మండలం రంగపేట పంచాయతీ కార్మికుడు మేసు సుందర్రావు విద్యుత్ షాక్‌తో మృతి చెందగా.. రూ.4.50 లక్షల బాండ్, రూ.50వేల చెక్కును ఆయన భార్య రత్నమ్మకు అందించారు. సర్పంచ్‌లు శేఖర్, బాస మహేశ్, డీఈ గంగారాం, ఎంపీవో సలీం, ఏఈ శ్రీనివాస్, ఏడీఈ సింధుశర్మ పాల్గొన్నారు.
వైద్య శిబిరాలు తప్పనిసరి
జగిత్యాల: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. వెలమ సంక్షేమ మండలి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆస్పత్రి నిర్వాహకులు సురేందర్‌రావు, కేడీసీసీ సభ్యులు రాంచందర్‌రావు, సాగర్‌రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.


