గిరిప్రదక్షిణలో భక్తులు | - | Sakshi
Sakshi News home page

గిరిప్రదక్షిణలో భక్తులు

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

రాయికల్‌/జగిత్యాలజోన్‌: రాయికల్‌ మండలం మైతాపూర్‌లో గిరిగుట్టపై వెలిసిన కనకదుర్గ దేవి ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చకుడు జగదీశ్వరశాస్త్రి మాట్లాడుతూ.. దుర్గాదేవిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు. మహిళలు మంగళహారతులతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, ఉపసర్పంచ్‌ ప్రణయ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ శివనీతి రమ్య, కౌన్సిలర్‌ పుర్రె శ్రీధర్‌, దొంగ లింగారెడ్డి, విజయకృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు. జగిత్యాలరూరల్‌ మండలం లక్ష్మీపూర్‌లోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ సోమవారం తృతీయ గిరి ప్రదక్షిణ చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర చేపట్టారు. ఆలయ అర్చకులు కూర్మచలం శరతాచార్యులు, సర్పంచ్‌ నల్ల కవిత, ఉప సర్పంచ్‌ సత్తిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement