విద్యావ్యవస్థను నాశనం చేసిన రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

విద్యావ్యవస్థను నాశనం చేసిన రేవంత్‌రెడ్డి

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

● వెయ్యికి పైగా స్కూళ్లు మూత ● ఇంటిగ్రేటెడ్‌ పేరుతో కొత్త డ్రామా ● మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి

జగిత్యాలటౌన్‌: రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో వెయ్యికి పైగా స్కూళ్లు మాతపడ్డాయని, ఉన్న స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మించకుండా ఇంటిగ్రేటెడ్‌ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. చల్‌గల్‌ వ్యవసాయ క్షేత్రంలో అనువైన స్థలం ఉన్నప్పటికీ తాటిపల్లిలో గుట్టలు, చెట్లు ధ్వంసం చేసి ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మించడమేంటని ప్రశ్నించారు. గతంలో ఉన్న రెసిడెన్షియల్‌ స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మించి విద్యను బలోపేతం చేయాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాక ఏటా ఎంతోమంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ రెసిడెన్షియల్‌ విద్యార్థులకు ఇప్పటివరకు రెండో విడత యూనిఫాం పంపిణీ చేయలేదన్నారు. ఆయన వెంట దేవేందర్‌నాయక్‌, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్‌, జన్ను రాజేందర్‌, ధర రమేశ్‌బాబు, చందా రాధాకిషన్‌రావు, నక్క జీవన్‌, వెంకటేశ్వర్‌రావు, కోరుకంటి రాము, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement