● అధికారులను నిలదీసిన బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ● కోరుట్ల మున్సిపల్ సాధారణ సమావేశం
కోరుట్ల: అక్రమ లేఅవుట్లపై కోరుట్ల మున్సిపల్ అధికారులను బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిలదీశారు. మున్సిపల్ సాధారణ సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తిరమల వసంత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. అజెండాలోని ఆరు అంశాలకు ఐదింటిని సభ్యులు ఆమోదించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లు కస్తూరి లక్ష్మీనారాయణ, ఇందూరి తిరుమల, బీఆర్ఎస్ కౌన్సిలర్లు వసీం, బాబా, మోసిన్ మాట్లాడుతూ పట్టణంలోని 1490 సర్వే నంబర్లో లేఅవుట్ లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, అధికారులు మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆ స్థలంలో లేఅవుట్ లేదని, రిజిస్ట్రేషన్లకు అనుమతించొద్దని గతంలో కమిషనర్ సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ ఇచ్చారని, అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిషర్ రాఘవేంద్రకు వినతిపత్రం సమర్పించారు. కౌన్సిలర్లు జాల మాధవి, రుద్ర సుజాత, శీలం జయలక్ష్మీ, యాటం పద్మ, దాసరి సునీత, కొక్కెర మహేశ్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, టేకుల శీరిష, చిట్యాల లక్ష్మీనారాయణ, రెంజర్ల కల్యాణి, కో ఆప్షన్ సభ్యులు సంగ మాలతి, బొద్దూరి సతీష్‌లు పాల్గొన్నారు.
శ్రమదోపిడీపై ప్రచార రథం
జగిత్యాలటౌన్: వెట్టి చాకిరీ, శ్రమ దోపిడీకి గురైన కార్మికులు కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని అదనపు కలెక్టర్ ప్రసూనాంబ సూచించా రు. వెట్టిచాకిరీపై అవగాహన కల్పించేందుకు కార్మి క శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథా న్ని కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించా రు. ప్రచారరథం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందన్నారు. కార్మిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న విధానాలపై ప్రజలు, కార్మికులకు అవగాహన కల్పిస్తుందన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ 080 69434343కి కాల్ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్మిక కమిషనర్ సురేంద్రకుమార్, ఉద్యోగులు, సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.


