జగిత్యాలక్రైం: నవరాత్రి ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమష్టి కృషితో పూర్తి చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్యశాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు తమవంతు కృషి చేశారని తెలిపారు.
సాయుధ పోరాట స్ఫూర్తి ఐలమ్మ
తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఎస్పీ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏవో శ్రీనివాస్, ఆర్‌ఐ వేణు, డీపీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఏకగ్రీవం
జగిత్యాల: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు వచ్చే నెల 4న జరగాల్సి ఉంది. అయితే 15 మంది సభ్యులతో కూడిన మేనేజింగ్ కమిటీ ఎన్నికకుగాను 24న నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో 15 మంది మాత్రమే నామినేషన్ వేశారు. డీసీవో, రెడ్‌క్రాస్ అధికారి మనోజ్‌కుమార్ ఏకగ్రీవమైన వారి వివరాలు వెల్లడించారు. సి.శ్రీనివాస్, కందుకూరి కృష్ణారెడ్డి, రాగ మనోహర్‌రెడ్డి, భీమనాతిని రమాదేవి, పి.నరేందర్‌గౌడ్, సిరిపురం శ్రీనివాస్, చిత్తారి మధుకర్, గుండ సురేశ్, ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, మచ్చనారాయణ, కె.వేణుగోపాల్, తుమ్మనపల్లి సత్యనారాయణ, జగదీశ్, కందుకూరి రవిబాబు, పెరుమండ్ల సుజాత ఎన్నికై నట్లు ప్రకటించారు.


