వేములవాడ: వేములవాడకు చెందిన వైద్యులు అనిల్, దీప్తి దంపతులకు ఇద్దరు కూతుళ్లు అన్విక, దీథా. తల్లి మనసులోని కళాతృష్ణను చూసి పెరిగిన ఆ కూతుళ్లు తల్లిబాటలోనే పయనిస్తున్నారు. తల్లితో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వృత్తిని, కళను సమన్వయం చేసుకుంటూ కూతుళ్లకు చిన్నతనం నుంచే భారతీయ సంస్కృతి, కళలపై అనురాగాన్ని పెంచుతున్నారు.
కూతురే.. కొడుకుగా
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని బోడగుట్టపల్లి గ్రామానికి చెందిన మల్క రామస్వామి, చంద్రకళ దంపతుల కూతురు శ్వేత 2014లో చల్మెడ మెడికల్ కళాశాలలో సీటు సాధించి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పీజీ పూర్తిచేసి సిద్దిపేటలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంలో గైనకాలజిస్టుగా పనిచేశారు. 15 రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో భర్త బండారి తిరుపతితో కలిసి సొంత ఆస్పత్రి ప్రారంభించారు.
తల్లిదండ్రులు మల్క రామస్వామి– చంద్రకళతో కూతురు శ్వేత


