పరిశోధన దృక్పథం పెంపొందిస్తుంది | - | Sakshi
Sakshi News home page

పరిశోధన దృక్పథం పెంపొందిస్తుంది

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

విద్యార్థుల్లో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించేలా జిజ్ఞాస దోహదపడుతోంది. మారుమూల ప్రాంతం నుంచి ఆసక్తికర స్టడీ ప్రాజెక్టులతో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. వరుసగా మూడుసార్లు రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొన్నారు.

– ఆంజనేయులు, ఇంగ్లిష్‌ లెక్చరర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గంభీరావుపేట

అధ్యాపకుల ప్రోత్సాహం బాగుంది

జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు రూపకల్పనలో అధ్యాపకుల ప్రోత్సాహం బాగుంది. వారి మార్గదర్శకత్వంలో ఎంచుకున్న అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రాజెక్టు రూపొందించాం. రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొనడం ఆనందంగా ఉంది.

– అనిల్‌, డిగ్రీ ఫైనలియర్‌,

గంభీరావుపేట

ప్రతిభను వెలికితీస్తున్నం

గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా కృషిచేస్తున్నాం. జిజ్ఞాసతో విద్యార్థుల్లో పరిశోధన నైపుణ్యం పెరుగుతుంది. ఇక్కడి నుంచి రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొనడం అభినందనీయం. భవిష్యత్‌లో మరిన్ని స్టడీ ప్రాజెక్టులు రూపొందించి విద్యార్థులు అందరి మన్నననలు అందుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం.

– విజయలక్ష్మి, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల, గంభీరావుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement