రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని బద్రిపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్న గూడ్సు రైళ్ల సమస్యపై కేంద్ర రైల్వేశాఖ స్పందించింది. ‘గూడ్సు రైళ్లతో పల్లెవాసులకు ప్రాణగండం’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితం కావడంతో గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ చింతల సుమన్.. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ ఖాతాకు ‘సాక్షి’ కథనాన్ని జోడిస్తూ పోస్టు చేశారు. గంట వ్యవధిలోనే మంత్రిత్వశాఖ పేషీ స్పందించింది. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపించాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయానికి ఆదేశాలు జారీచేశారు. కేంద్రమంత్రిత్వశాఖ స్పందించడంపై గ్రామస్తులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి కథనంపై స్పందించిన కేంద్ర మంత్రిత్వశాఖ పేషీ


