మంగళగిరి రూరల్: ఉపాధి కోసం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పని చేసేందుకు వచ్చిన ఓ యువ ఇంజినీర్ చివరకు అదే కంపెనీ వాహనం కింద పడి మృతిచెందాడు. రాజన్నసిరిసిల్ల పట్టణానికి చెందిన కళికవాయి వెంకటశ్యామ్(22) రాజధానిలో ఈ–14 రోడ్డు నిర్మాణం చేస్తున్న మెయిల్ అనే కంపెనీలో జూనియర్ సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో ఈ–5 క్యాంప్ నుంచి విధులకు హాజరవుతున్నాడు. మంగళవారం మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో క్రికెట్ స్టేడియం సమీపంలో నిర్మిస్తున్న ఈ–14లో డ్యూటీ చేస్తున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో డివైడర్ ఏర్పాటుకు సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ నింపే క్రమంలో ఓ వాహనం వచ్చింది. ఆ వాహనం వెనక్కి వచ్చే క్రమంలో శ్యామ్‌ను ఢీకొనడంతో టైర్ కింద పడిపోయాడు. తోటి ఉద్యోగులు శ్యామ్‌ను హుటాహుటిన ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు.
ఏపీ రాజధాని ప్రాంతంలో ఈ–14 రోడ్డు నిర్మాణ పనుల్లో ఘోరం
కాంక్రీట్ మిక్సర్ వాహనం కిందపడి దుర్మరణం
రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన వ్యక్తి గా గుర్తింపు


