కథలాపూర్: కథలాపూర్ మండలం చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 55మంది విద్యార్థులే ఉన్నారు. బడికి జీవం పోయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, గ్రామస్తులు సమావేశమై ఇంటింటా ప్రచారం చేశారు. దీంతో విద్యార్థుల సంఖ్య 110కి చేరింది. పాఠశాల పునఃప్రారంభమైనా.. కొందరు పిల్లలు రాకపోవడంతో సర్పంచ్ నాగం భూమయ్య, హెచ్‌ఎం సుధాకర్ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లారు. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను బైక్‌లపై పాఠశాలకు తీసుకొచ్చారు. పిల్లలు పాఠశాలకు చేరుకునేలా ఆటో సౌకర్యం కల్పిస్తామని సర్పంచ్ భూమయ్య తెలిపారు.


