
గదులు నిర్మించండి
వేలాది మంది వచ్చే కొండగట్టులో 47గదులే ఉండటం సిగ్గుచేటు. ఆదాయం రూ.కోట్లలో వస్తున్నా.. పట్టించుకోకపోవడం సరికాదు. భక్తులకు సరిపడా గదులు ఉంటేనే ఆలయానికి ఆదాయం వస్తుంది. వెంటనే 100గదుల కాటేజ్ నిర్మించాలి.
– కె.రాజశేఖర్, సామాజిక సేవకర్త, నమిలికొండ
కమిషనర్ దృష్టికి తీసుకెళ్తా
కొండగట్టులో గదుల కొరత ఉన్నది వాస్తవమే. భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆలయం ఆధ్వర్యంలో నూతన గదుల నిర్మాణం గురించి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. వారి నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాం.
– చంద్రశేఖర్, ఈవో, కొండగట్టు

గదులు నిర్మించండి