
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కుక్క గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న గ్రేట్ డేన్ కుక్క జ్యూస్ మరణించింది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జ్యూస్ అనే అమెరికన్ గ్రేట్ డేన్ కుక్క ప్రపంచంలోనే ఎత్తయిన కుక్కగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీని ఎత్తు 3 అడుగుల 5.18 అంగుళాలు.
ప్రస్తుతం దాని వయసు 3 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఎముకల సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతున్న జ్యూస్ ఆరోగ్యం క్షీణించి చివరికి ప్రాణాలు కోల్పోయింది. అయితే ముందుగా జ్యూస్ కుడికాకులో క్యాన్సర్‌ను గుర్తించగా దాని చికిత్సలో భాగంగా జ్యూస్ కుడికాలిని తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు జ్యూస్‌కు న్యుమోనియా నిర్ధారణ కావడంతో ఆరోగ్యం క్షీణించి సెప్టెంబర్ 12వ తేదీన తెల్లవారుజామున చనిపోయినట్లు దాని యజమాని డోనీ డేవిస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.