చెత్త సినిమాలకు కూడా అవార్డులా..!

Worst Movie Awards Announced - Sakshi

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సినీ రంగంలో వివిధ కేటగిరీలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను ఇస్తూంటారు.  సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఏదంటే ఠక్కున చెప్పే పేరు ఆస్కార్‌ అవార్డు. ఈ అవార్డును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది నటీనటులు, టెక్నిషియన్స్‌ , దర్శకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. ఈ అవార్డు కేవలం ప్రజాదరణ పొందిన సినిమాలకు మాత్రమే వరిస్తాయి. మంచి సినిమాలకు అవార్డులు లభిస్తే మనం పొందే ఆనందం అంతఇంతా కాదు. మరి అత్యంత చెత్త సినిమాల పరిస్థితి ఏంటి?  అని మనలో చాలా మందికి అనిపించే ఉంటుంది.  

ప్రజాదరణ పొందని, లేదా అత్యంత పరమ చెత్త సినిమాలకు కూడా అవార్డులు ఇస్తే బాగుంటుందని మనలో చాలా మందికి అనిపించే ఉంటుంది. మంచి సినిమాలకే కాదు చెత్త సినిమాలకు కూడా అవార్టులు ఇస్తారండోయ్‌..!. వరస్ట్‌ సినిమాలకు కూడా హాలీవుడ్‌లో ఒక అవార్డు  అందిస్తారు. ఆ అవార్డే గోల్డెన్ రాస్ప్బెర్రీ అవార్డు. దీనినే రజ్జీస్‌ అవార్డుగా కూడా పిలుస్తారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం తొలిసారిగా 1981 మార్చి 31న నిర్వహించారు. అకాడమీ అవార్డులను అందించే ముందు రోజు ఈ అవార్డు వేడుకలను అందిస్తారు. వరస్ట్‌గా నటించినవారికి, దర్శకులకు ఈ అవార్డును అందిస్తారు.

ఇక్కడ విషయమేమిటంటే ఇప్పటి వరకు 14 మంది మాత్రమే ఈ అవార్డులను స్వీకరించారు. కాగా రజ్జీస్‌ విజేతలను పలు దేశాల నుంచి 1,097 మంది సభ్యులను ముందుగా ఎంపిక చేస్తారు. వీరు ఆన్‌లైన్‌లో సభ్యత్వ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఈ ఏడాది గాను వివిధ కేటగిరీలో రజ్జీస్‌ అవార్డులను ప్రకటించారు..

రజ్జిస్‌ అవార్డు  విజేతలు వీరే..
వరస్ట్‌ యాక్టర్‌:మైక్ లిండెల్- ది పిల్లో గయ్‌ 
వరస్ట్‌ యాక్టరస్‌: కేట్ హడ్సన్ర్
వరస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టరస్‌: మాడ్డీ జిగ్లెర్ర్
వరస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌: రూడీ గియులియాని 
వరస్ట్‌ డైరెక్టర్: సియా

చదవండి: హాలీవుడ్‌ని ఏలుతున్న ఇండియన్‌ అమ్మాయి అర్చీ పంజాబీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top