-
చెత్త సినిమాలకు కూడా అవార్డులా..!
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సినీ రంగంలో వివిధ కేటగిరీలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను ఇస్తూంటారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఏదంటే ఠక్కున చెప్పే పేరు ఆస్కార్ అవార్డు. ఈ అవార్డును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది నటీనటులు, టెక్నిషియన్స్ , దర్శకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. ఈ అవార్డు కేవలం ప్రజాదరణ పొందిన సినిమాలకు మాత్రమే వరిస్తాయి. మంచి సినిమాలకు అవార్డులు లభిస్తే మనం పొందే ఆనందం అంతఇంతా కాదు. మరి అత్యంత చెత్త సినిమాల పరిస్థితి ఏంటి? అని మనలో చాలా మందికి అనిపించే ఉంటుంది. ప్రజాదరణ పొందని, లేదా అత్యంత పరమ చెత్త సినిమాలకు కూడా అవార్డులు ఇస్తే బాగుంటుందని మనలో చాలా మందికి అనిపించే ఉంటుంది. మంచి సినిమాలకే కాదు చెత్త సినిమాలకు కూడా అవార్టులు ఇస్తారండోయ్..!. వరస్ట్ సినిమాలకు కూడా హాలీవుడ్లో ఒక అవార్డు అందిస్తారు. ఆ అవార్డే గోల్డెన్ రాస్ప్బెర్రీ అవార్డు. దీనినే రజ్జీస్ అవార్డుగా కూడా పిలుస్తారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం తొలిసారిగా 1981 మార్చి 31న నిర్వహించారు. అకాడమీ అవార్డులను అందించే ముందు రోజు ఈ అవార్డు వేడుకలను అందిస్తారు. వరస్ట్‌గా నటించినవారికి, దర్శకులకు ఈ అవార్డును అందిస్తారు. ఇక్కడ విషయమేమిటంటే ఇప్పటి వరకు 14 మంది మాత్రమే ఈ అవార్డులను స్వీకరించారు. కాగా రజ్జీస్ విజేతలను పలు దేశాల నుంచి 1,097 మంది సభ్యులను ముందుగా ఎంపిక చేస్తారు. వీరు ఆన్లైన్లో సభ్యత్వ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది గాను వివిధ కేటగిరీలో రజ్జీస్ అవార్డులను ప్రకటించారు.. రజ్జిస్ అవార్డు విజేతలు వీరే.. వరస్ట్ యాక్టర్:మైక్ లిండెల్- ది పిల్లో గయ్ వరస్ట్ యాక్టరస్: కేట్ హడ్సన్ర్ వరస్ట్ సపోర్టింగ్ యాక్టరస్: మాడ్డీ జిగ్లెర్ర్ వరస్ట్ సపోర్టింగ్ యాక్టర్: రూడీ గియులియాని వరస్ట్ డైరెక్టర్: సియా చదవండి: హాలీవుడ్‌ని ఏలుతున్న ఇండియన్ అమ్మాయి అర్చీ పంజాబీ -
హీరోహీరోయిన్లకు చెత్త అవార్డులు
ముంబై: 'దిల్ వాలే' నటనకు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 2016 ఘంటా అవార్డుల్లో వరస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చెత్త సినిమాగా నిలిచింది. ఏడాది కాలంలో బాలీవుడ్ లో విడుదలైన వాటిలో చెత్తవాటికి ఘంటా అవార్డులు ఇస్తుంటారు. సూరజ్ బరజాత్య దర్శకత్వం వహించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' అత్యధిక చెత్త అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాలో నటించిన సోనమ్ కపూర్ చెత్త నటిగా ఎంపికైంది. టైటిల్ ట్రాక్ కూడా వరస్ట్ సాంగ్ గా నిలిచింది. సల్మాన్ సోదరుడిగా నటించిన నితిన్ ముఖేశ్ చెత్త సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. షాహిద్ కపూర్-అలియా భట్ సినిమా 'షాందార్'ను తెరకెక్కించిన వికాస్ బహల్ చెత్త దర్శకుడిగా ఎంపికయ్యాడు. సూరజ్ పంచోలి కొత్తగా పరిచయమైన చెత్త నటుడిగా నిలిచాడు. 'బాంబే వెల్వెట్' లో కరణ్ జోహార్ విలన్ గా నటించడాన్ని వరస్ట్ మిస్ కాస్టింగ్ గా తేల్చారు. 'అలోన్' డ్యుయల్ రోల్ చేసిన బిపాసా బసు వరస్ట్ కఫుల్ అవార్డు దక్కించుకుంది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ.. అలా మద్దతు ఇచ్చాడా?
ఓట్ హక్కు వినియోగించుకున్న విజయ్ సాయి రెడ్డి, దేవినేని అవినాష్
శిల్పా నా ఫ్రెండ్.. నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..
అక్కడ ఒక్క సీటు కూడా ఓడిపోం: ప్రధాని మోదీ
సరైన భద్రత లేదు..విజయసాయిరెడ్డి అసహనం
టీడీపీ నేతల దౌర్జన్యాలు.. ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం
సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు వేశారు
19 ఏళ్ల రీ రిలీజ్ అవుతున్న హిట్ సినిమా.. అదేంటంటే?
పిఠాపురంలో జోరుగా పోలింగ్
తప్పక చదవండి
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement