అమెరికాలో వరుస ఘటనలు, సరికొత్త స్మార్ట్‌ గన్‌.. ఎవరుపడితే వారు కాల్చలేరు

Worlds First Smart Gun With Biometric Face Recognition Unlock Launched - Sakshi

వాషింగ్టన్‌: యజమాని మినహా మరెవరూ పేల్చడం సాధ్యంగాని 9ఎంఎం తుపాకీని తయారు చేసింది అమెరికాకుచెందిన బయోఫైర్ కంపెనీ. ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్, కాల్చే వ్యక్తిని పోల్చుకునే ఫేషియల్‌ రికగ్నేషన్‌  టెక్నాలజీ దీని సొంతం. ఇలాంటి తుపాకీ ప్రపంచంలో ఇదే మొదటిది. గన్‌ను పక్కన పెట్టేయగానే లాక్‌ అవుతుంది. అమెరికా వంటి దేశాల్లో చిన్నారులు పొరపాటున తుపాకీ కాల్చడం, గన్‌ చోరీ తదితరాలకు ఇక తెర పడుతుందని బయోఫైర్‌ సంస్థ చెబుతోంది. ఈ సంస్థకు ఇంటెల్, గూగుల్, నాసాలు తోడ్పాటునందిస్తున్నాయి.

అమెరికాలో తరచూ తుపాకీల కాల్పులు ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ హింసను నియంత్రించి తుపాకీని ఎవరు పడితే వారు వాడకుండా  చేయాలనే సదుద్దేశంతో ఈ స్మార్ట్‌గన్‌ను అభివృద్ధి చేసినట్లు బయోఫైర్ పేర్కొంది. వచ్చే ఏడాది ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇప్పుడే ప్రీ ఆర్డర్లు కూడా తీసుకుంటోంది.

ఈ స్మార్ట్ గన్‌ను బయోఫైర్ వ్యవస్థపకుడు క్లోయేఫర్(26) అభివృద్ధి చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే దీన్ని రూపొందిస్తున్నారు. సాంకేతికతతో ప్రతి సమస్యను పరిష్కరించేలేమని, కానీ అమెరికాలో క్లిష్టమైన సమస్యలను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించుకోగలమని క్లోయేఫర్ పేర్కొన్నారు. ఈ గన్‌తో పొరపాటున పిల్లల చేతుల్లో తుపాకులు పేలే ఘటనలు తగ్గుతాయని చెప్పారు. యజమానులు తప్ప మరెవరికీ తుపాకీని ఉపయోగించడం సాధ్యం కాకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉండవన్నారు.
చదవండి:  కృత్రిమ మేధపై గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఆందోళన.. తేడావస్తే అంతే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top