3 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేసింది! | Women Creates World Record By Travelling World In 3 Days | Sakshi
Sakshi News home page

3 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేసింది! 

Nov 20 2020 9:42 AM | Updated on Nov 20 2020 9:55 AM

Women Creates World Record By Travelling World In 3 Days - Sakshi

అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో...

అబుదాబి‌ : 3 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించిందో మహిళ. అతి తక్కువ సమయంలో 208 దేశాలు తిరిగింది. వివరాల్లోకి వెళితే.. యూఏఈకి చెందిన డాక్టర్‌ ఖావ్లా అల్‌ రొమైతీ అనే మహిళకు గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాలనేది కల. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుడితే బాగుంటుందని అనిపించింది. అందుకోసం ప్రణాళికలు తయారు చేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచ యాత్ర మొదలు పెట్టింది. ఫిబ్రవరి 13వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీవద్ద యాత్రను ముగించింది. ( బాయ్‌కాట్ బింగో: ర‌ణ్‌వీర్‌పై ట్రోలింగ్‌ )

3 రోజుల 14 గంటల 46 నిమిషాల్లో 208 దేశాలను చుట్టేసింది. అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టినందుకుగానూ ఆమె పేరు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. గురువారం గిన్నిస్‌ బుక్‌ వారు ఇచ్చిన సర్టిఫికేట్‌తో ఫొటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘నాకు గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అంటే ఎంతో ఆసక్తి. అందుకే ప్రపంచాన్ని చుట్టేశా.. గిన్నిస్‌ బుక్‌ సర్టిఫికేట్‌ అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేన’’ని పేర్కొన్నారు. ( ‘కరోనా’కి జై కొడుతున్నారు! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement