Viral: ఇదో చెత్త ప్రశ‍్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్

Woman Accidentally Sent Mock Interview Clip To Hiring Company - Sakshi

Woman's Disastrous Job Interview Experience:  కోవిడ్ కారణంగా ప్రజల జీవనశైలిలో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చి ఇంటివద్ద నుంచి విధులు నిర్వర్తించే వెసులబాలు కల్పించిన సంగతి తెలిసిందే. పైగా ఇంటర్వ్యూలు సైతం ఆన్ లైన్‌లోనే జరుగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో పలు ఫన్నీ ఘటనలు జరిగిన వీడియోలు చాలానే చూశాం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలాంటి మరో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిదంటే.. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ అటెండెంట్ జాబ్ కోసం ఆన్‌లైన్‌లో చైలీన్ మార్టినెజ్ అనే యువతి ఇంటర్వ్యూ కోసం సిద‍్ధమైంది. 

ఈ సందర్భంగా.. ‘స్కైవెస్ట్ కంపెనీ కల్చర్ పై మీ అభిప్రాయం ఏంటి’ అని మార్టినెజ్ను సంస్థ అధికారి ప్రశ్నించారు. దీనికి మార్జినెజ్ ఫన్నీగా తన పక్కనే ఉన్న వేరొకరితో ‘నా జీవితంలో నేను విన్న అతి తెలివితక్కువ, చీజీ ప్రశ్న’ అని సమాధానం ఇవ్వడంతో సదరు అధికారి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. అంతేకాకుండా ఆ సమయంలో వీడియోని కాస్త పాజ్‌లో ఉంచి మరీ మార్టినెజ్ లిప్ గ్లాస్ వేసుకుంటూ కనిపించడం అధికారిని ఆశ‍్చర్యానికి గురి చేసింది. అయితే, మార్టినెజ్ ఇంటర్వ్యూ కోసం వీడియో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పొరపాటున ఆమె ఇంటర్వ్యూ వీడియో రికార్డు ఆన్ చేయడంతో ఇదంతా జరిగింది. 

ఇక తన తప్పును తెలుసుకున్న యువతి వెంటనే తేరుకుని తన సమాధానంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. స్కైవెస్ట్ కంపెనీ ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ జాబ్‌ రిజెక్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు చాలామంది  పాపం ఆమెకు మరే కంపెనీలో జాబ్ రాదని, మరి కొందరేమో అలాంటిది ఏమీ లేదు ఆమెకు మరో కంపెనీలో ఉద్యోగం వస్తుందని ట్వీట్‌ చేశారు.

(చదవండి: అతని శరీరంలో కరోనా శాశ్వతంగా ఉండిపోతుందట.. ఇదే తొలికేసు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top