ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న వెర్బల్‌ ఫాస్ట్‌! అసలు ఈ ఉపవాసం ఎందుకంటే..

Why Verbal Fast Trending At Social Media Know The Reason Here - Sakshi

వెర్బల్‌ ఫాస్ట్‌.. #VerbalFast ఈ ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌ ట్యాగ్‌. అసలు ఇదేం ఉపవాసం? అని.. దాని ఉద్దేశం ఏంటో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి.. 

ఇలాంటి ఉపవాసం గురించి గూగుల్‌లో కూడా ఎలాంటి హిస్టరీ లేదు. 45 ఏళ్ల అమెరికన్‌ ర్యాపర్‌ కాన్యే వెస్ట్.. సంచలన నిర్ణయం ద్వారానే ఇది తెర మీదకు వచ్చింది. సోషల్‌ మీడియా వేదిక వర్బల్‌ ఫాస్ట్‌ను పాటించబోతున్నట్లు ప్రకటించాడు వెస్ట్‌. ఈ మేరకు ‘యే ’గా తన పేరును మార్చుకున్న ఆయన.. నెలరోజులపాటు ఈ ఉపవాసం ఆచరిస్తానని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు. 

Verbal Fast అంటే.. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం. మౌన వ్రతం లాంటిదే!. అదీ నిర్దేశించుకున్న టైం వరకు!. నిమిషాల నుంచి రోజుల తరబడి ఈ ఉపవాసం కొనసాగించవచ్చు. అయితే.. కాన్యే వెస్ట్ మరో అడుగు ముందుకు వేసి ఈ నెల రోజులపాటు ఆల్కాహాల్‌కు దూరంగా ఉంటానని ప్రకటించాడు. అంతేకాదు.. అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండడంతో పాటు శృంగారంలోనూ పాల్గొనబోనని ప్రకటించాడు. దీంతో వెస్ట్‌ ఫ్యాన్స్‌.. ఈ ఫాస్ట్‌ ట్రెండ్‌ను వైరల్‌ చేస్తున్నారు. అయితే.. 

ఎవరితో మాట్లాడకపోయినప్పటికీ.. సోషల్‌ మీడియాకు మాత్రం దూరంగా ఉండడని స్పష్టం చేశాడు. ప్రముఖ ఈ-సెలబ్రిటీ కిమ్‌ కర్దాషియన్‌ మాజీ భర్త అయిన కాన్యే వెస్ట్ అలియాస్‌ యే.. ఈ ఉపవాసం ఎందుకు చేపడతున్నాడన్న దానిపై స్పష్టత లేదు. కాకపోతే ఈ మధ్య విద్వేషపూరిత వ్యాఖ్యలతో ఆయన సోషల్‌ మీడియా అకౌంట్లు.. ఆంక్షలను ఎదుర్కొన్నాయి. 

యూదులకు వ్యతిరేకంగా కాన్యే వెస్ట్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆ దెబ్బకు.. కాన్యే వెస్ట్‌ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. అయితే.. ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ పగ్గాలు చేపట్టాక తిరిగి.. వెస్ట్‌ అకౌంట్లు యాక్టివ్‌ అయ్యాయి. తిరిగి వచ్చిన వెస్ట్‌.. ఇలా వెర్బల్‌ ఫాస్ట్‌తో సరికొత్త ట్రెండ్‌ సృష్టించాడు. ఇక యూదులపై చేసిన వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పీచెప్పనట్లు చెప్పాడు వెస్ట్‌. మరోవైపు ఈ అమెరికన్‌ ర్యాపర్‌ వ్యాఖ్యలు ఆయన బ్రాండింగ్‌పై కూడా పెను ప్రభావం చూపెట్టింది. అక్టోబర్‌లో జర్మనీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ కంపెనీ అడిడాస్‌.. ఆయనతో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. గ్యాప్‌, బాలెన్‌సియాగా సైతం ఆయనతో బ్రాండింగ్‌ ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి.

ఇదీ చదవండి: విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top