‘రష్యా టీకా అడ్వాన్స్‌ స్టేజ్‌లో లేదు’

WHO: Russia Vaccine Is Not In Advance Stage - Sakshi

లండన్‌:  కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భాగంగా ప్రయోగ దశలో ముందున్నాయని తాము భావిస్తున్న తొమ్మిది వ్యాక్సిన్లలో రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. పరీక్షల దశలోనే వ్యాక్సిన్ల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలుగా డబ్లు్యహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టీకాలను అడ్వాన్స్‌ స్టేజ్‌లో ఉన్నట్లుగా గుర్తించింది. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌పై తగినంత సమాచారం లేదు కాబట్టి దాని సమర్థతపై నిర్ణయానికి రాలేమని డబ్ల్యూహెచ్‌‌వో సీనియర్‌ సలహాదారు డాక్టర్‌ బ్రూస్‌ అయల్వార్డ్‌ అన్నారు. టీకా ఏ దశలో ఉందో అర్థం చేసుకోవడానికి రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. (రష్యా టీకాపై మిశ్రమ స్పందన!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top