Wagner Group Poses Threat To NATO Assets From Belarus - Sakshi
Sakshi News home page

బెలారస్ లో వాగ్నర్‌ సైన్యం చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్‌.. అంతా ప్లాన్ ప్రకారమే..?

Jul 21 2023 11:58 AM | Updated on Jul 21 2023 12:51 PM

 Wagner Group Poses Threat To Nato Assets From Belarus - Sakshi

మాస్కో: రష్యా బలగాలపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ సైన్యం చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్‌ ప్రస్తుతం బెలారస్ లో ఉన్నట్లుగా చూపిస్తూ ఇటీవల ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్‌ బెలారస్ లో ఉంటేనే పోలాండ్, లిథువానా సమీపంలోని నాటో ఆస్తులపై  చేసేందుకు అనువుగా ఉంటుందంటున్నాయి రష్యా వర్గాలు. 

లొకేషన్ చేంజ్.. 
రష్యాపై ఉన్నట్టుండి తిరుగుబాటు చేసిన వాగ్నర్‌ గ్రూపు సైన్యం చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్‌తోనూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశంకో మధ్యవర్తిత్వం నడిపి సంధి కుదిర్చిన విషయం తెలిసిందే. సంధి జరిగిన నాటి నుండి ఇంతవరకు వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్‌ ఎక్కడా బయట కనిపించలేదు. దీనిపై చాలా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల విడుదలైన కొన్ని వీడియోల ఆధారంగా ఆయన బెలారస్ లో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది.

రష్యాకే బెనిఫిట్.. 
బెలారస్ లో యెవ్జెనీ ప్రిగోజిన్‌ అక్కడి సైన్యానికి శిక్షణ ఇస్తోన్న కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యా మాజీ సైన్యాధికారి ఆండ్రీ కర్తపోలోవ్ కొంత స్పష్టత ఇచ్చారు. వాగ్నర్ సైన్యం ప్రస్తుతం బెలారస్ లో ఉండడమే కరెక్టని, అక్కడ ఉంటేనే   బెలారస్ సరిహద్దు ప్రదేశాలు పోలాండ్, లిథువానాలతోపాటు ఉక్రెయిన్ లోని నాటో ఆస్తులపై దాడి చేసే వీలుంటుందని, అది రష్యాకు కలిసొచ్చే అంశమేనని తెలిపారు. 

మరోపక్క ఇదంతా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రణాళికలో భాగమని, దాని అనుసారంగానే తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్జెనీ ప్రిగోజిన్‌ను దేశం దాటించి అతని స్థానంలో మరొకరిని వాగ్నర్ బృందానికి నాయకుడిగా నియమించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement