పుతిన్‌ కారుపై దాడి.. క్షేమంగా రష్యా అధ్యక్షుడు! అడ్రస్‌ లేకుండా పోయిన ప్రియురాలు

Vladimir Putin limo attacked in assassination attempt - Sakshi

మాస్కో: రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగినట్లు  వచ్చిన వార్తలు తీవ్ర కలకలం సృష్టించాయి. పుతిన్‌ ఇటీవలే అత్యాధునిక లిమోసిన్‌ కారులో ప్రయాణిస్తుండగా, ముందుభాగంలో ఎడమ వైపు చక్రం పెద్ద శబ్దంతో పేలిందని, వెంటనే పొగ వెలువడిందని కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, క్షేమంగా ఉన్నారని వెల్లడించాయి.

భద్రతా లోపాలకు బాధ్యులుగా గుర్తిస్తూ పుతిన్‌ సెక్యూరిటీ సర్వీసులోని కొందరిని అరెస్టు చేశారని, మరికొందరు అంగరక్షకులను విధుల నుంచి తొలగించారని జనరల్‌ ఎస్‌వీఆర్‌ టెలిగ్రామ్‌ చానల్‌ తెలియజేసింది. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక నిజంగా పుతిన్‌ను అంతం చేయడానికి ఎవరైనా కుట్ర పన్నారా? అనేది నిర్ధారణ కాలేదు. క్రెమ్లిన్‌ వర్గాలు దీనిని ధృవీకరించాల్సి ఉంది.

అలైనా ఎక్కడ?
ఇదిలా ఉండగా,  పుతిన్‌కు అలైనా కబాయెవా(39) అనే ప్రియురాలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి అని సమాచారం.  వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, పుతిన్‌ ఒత్తిడి చేయడంతో అలైనా గర్భస్రావం చేయించుకున్నారని రష్యాలోని అనధికార వర్గాలు వెల్లడించాయి. పుతిన్‌తో ఆమె ఇప్పటికే పలువురు పిల్లలను కన్నట్లు తెలుస్తోంది. అలైనా చివరిసారిగా ఈ ఏడాది జూన్‌ మొదటివారంలో కనిపించారు. ఆ తర్వాత జాడ లేదు.

ఇదీ చదవండి: లాస్ట్‌ ఫ్లైట్‌ జర్నీ...విమానంలో క్వీన్‌ మృతదేహం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top