‘వాన్స్‌’ ఉత్తమ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి: వివేక్‌రామస్వామి | Vivek Ramaswamy Post On Jd Vance In Twittter | Sakshi
Sakshi News home page

జేడీ వాన్స్‌ ఉత్తమ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి: వివేక్‌రామస్వామి

Jul 16 2024 8:39 AM | Updated on Jul 16 2024 9:39 AM

Vivek Ramaswamy Post On Jd Vance In Twittter

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ వైస్‌ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా జేడీ వాన్స్‌ ఎంపికపై భారత సంతతి బిలియనీర్‌ వివేక్‌రామస్వామి స్పందించారు. 

‘నా స్నేహితుడు వాన్స్‌ను చూసి నేను గర్వపడుతున్నా. అతను నా ఫ్రెండే కాదు. క్లాస్‌మేట్‌. లాస్కూల్‌లో చదవుకునేపుడు మేమిద్దరం చాలా ఎంజాయ్‌ చేశాం. వాన్స్‌ ఉత్తమ వైస్‌ ప్రెసిడెంట్‌ క్యాండిడేట్‌. అతడి గెలుపు కోసం, దేశం బాగు కోసం నేను ఎదురు చూస్తున్నా’అని వివేక్‌రామస్వామి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వివేక్‌రామస్వామి ప్రైమరీల దశలోనే తప్పుకుని ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు.  ఈ ఏడాది నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌, రిపబ్లికన్ల తరపున ట్రంప్‌ పోటీ పడుతున్నారు. ట్రంప్‌ తన వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా ఒహియో సెనేటర్‌ జేడీ  వాన్స్‌ను తాజాగా  ఎంపిక చేసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement