జలపాతానికే రంగులు వేసే స్టంట్‌...పర్యావరణ అధికారులు ఫైర్‌ | Sakshi
Sakshi News home page

Viral Video: జలపాతానికే రంగులు వేసే స్టంట్‌...పర్యావరణ అధికారులు ఫైర్‌

Published Sat, Oct 1 2022 8:56 PM

Viral Video: Couple Polluted Queima Pe rive Stunt In Brazil Investigated  - Sakshi

ఇటీవల కాలంటో స్టంట్‌ల క్రేజ్‌ మామాలుగా లేదు. కొంతమంది సోషల్‌ మీడియా స్టార్‌డమ్‌ కోసం ఎలాంటి స్టంట్‌లు చేస్తున్నామన్నా అవగాహన కూడా లేకుండా చేసేస్తున్నారు. ఆ స్టంట్‌లు ఒక్కొసారి వారి ప్రాణాలకు లేదా పక్కవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఉంటున్నాయి. ఇక్కడొక జంట అయితే ప్రకృతినే పొల్యూట్‌ చేసే స్టంట్‌కి ఒడిగట్టారు. దీంతో రంగంలోకి దిగిన పర్యావరణ అధికారులు ఆ జంట ఎవరా? అని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు.

వివరాల్లోకెళ్తే... బ్రెజిల్‌కి చెందిన ఒక జంట సహజ సిద్ధమైన జలపాతాలను తమ స్టంట్‌ కోసం కలుషితం చేశారు. ఇంతకీ ఏం చేశారంటే...జలపాతం సహజంగా పాలనురగాలా కనిపిస్తుంది జౌనా!. ఐతే ఈ జంట నీలి రంగులా కనిపించేలా ఇంకో అమ్మాయి నీలి రంగు ఫోమ్‌ని జల్లుతూ ఉంటుంది. ఈ స్టంట్‌ ఉద్దేశ్యం ఏంటంటే..నీలిరంగులో జలపాతం కనిపిస్తే శిశువు మగబిడ్డను సూచిస్తుందని చెబుతూ ఈ స్టంట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవ్వడంతో సహజ సిద్ధంగా కనిపించే జలపాతాన్ని కలుషితం చేస్తారా అని నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. దీంతో బ్రైజిల్‌ పర్యావరణ అధికారులు ఈ సంఘటనపై ఒక్కసారిగా సీరియస్‌ అయ్యారు.

అంతేగాదు బ్రెజిల్‌ పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ఘటనపై దర్యాప్తు  ప్రారంభించింది. ఈ ఘటన గత ఆదివారం సెప్టంబర్‌ 25న మాటో గ్రాస్‌ అనే రాష్ట్రంలో చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఆ జంట కలుషితం చేసిన జలపాతం ప్రసిద్ధ టూరిజం ప్రాంతమైన క్యూమా పే నది అని అధికారులు వెల్లడించారు. ఆ నది పశ్చిమ ప్రాంతంలోని తంగారా డా సెర్రా నగరానికి ప్రాథమిక నీటి వనరు అని కూడా స్పష్టం చేశారు. అసలు ఆ గుర్తు తెలియని దంపతులు ఏ ఉత్పత్తులు వినియోగించి జలపాతానికి నీలి రంగు వచ్చేలా చేశారు, పర్యావరణానికి హాని జరిగిందా లేదా అనే దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: డబ్ల్యూడబ్ల్యూఈ’ని తలపించేలా నడి రోడ్డులో మహిళల ఫైట్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement