చోరీకి వెళ్లిన దొంగ.. రక్షించిన పోలీసులు

Viral: Thief Slipped And Got Stucked In The Middle Of Railing In Mexico - Sakshi

మెక్సికో :  సైలెంట్‌గా దొంగతనం చేసి ఉడాయిద్దామనుకున్న ఆ దొంగోడి ప్లాన్‌ బెడిసి కొట్టింది. దొంగతనం చేసిన డబ్బులతో జల్సా చేద్దామనుకుంటే అతడ్ని దురదృష్టం వెంటాడింది. తల రైలింగ్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులకు పట్టించింది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగకు చేదు అనుభవం ఎదురైంది. రైలింగ్‌ నుంచి ఇంట్లోకి దూరేందుకు ప్రయత్నించగా, అనుకోకుండా అతడి తల రైలింగ్‌లో ఇరుక్కుపోయింది.


అక్కడి నుంచి బయటపడేందుకు చాలానే ట్రై చేవాడు కానీ ఏదీ వర్కవుట్‌ కాలేదు. కొంత సమయానికి ఇది గమనించిన స్థానికులు.. దొంగోడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంత ప్రయత్నించినా అతడిని రైలింగ్‌ నుంచి విడిపించలేకపోలేరు. దీంతో అత్యవసర విభాగాన్ని సంప్రదించగా, రెండు గంటల తర్వాత అక్కడికి చేరుకున్న సిబ్బంది...బోల్డ్‌ కట్టర్ల సాయంతో ఇనుప చువ్వలను కట్‌ చేసి అతడిని విడిపించారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 

చదవండి : వైరల్‌: ఆహారం అనుకుందో.. కోపమొచ్చిందో
వైరల్‌: నడి రోడ్డు మీద తలస్నానం!

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top