breaking news
structed
-
వైరల్ : ఆ దొంగోడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
మెక్సికో : సైలెంట్‌గా దొంగతనం చేసి ఉడాయిద్దామనుకున్న ఆ దొంగోడి ప్లాన్ బెడిసి కొట్టింది. దొంగతనం చేసిన డబ్బులతో జల్సా చేద్దామనుకుంటే అతడ్ని దురదృష్టం వెంటాడింది. తల రైలింగ్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులకు పట్టించింది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగకు చేదు అనుభవం ఎదురైంది. రైలింగ్ నుంచి ఇంట్లోకి దూరేందుకు ప్రయత్నించగా, అనుకోకుండా అతడి తల రైలింగ్‌లో ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి బయటపడేందుకు చాలానే ట్రై చేవాడు కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. కొంత సమయానికి ఇది గమనించిన స్థానికులు.. దొంగోడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంత ప్రయత్నించినా అతడిని రైలింగ్ నుంచి విడిపించలేకపోలేరు. దీంతో అత్యవసర విభాగాన్ని సంప్రదించగా, రెండు గంటల తర్వాత అక్కడికి చేరుకున్న సిబ్బంది...బోల్డ్ కట్టర్ల సాయంతో ఇనుప చువ్వలను కట్ చేసి అతడిని విడిపించారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. చదవండి : వైరల్: ఆహారం అనుకుందో.. కోపమొచ్చిందో వైరల్: నడి రోడ్డు మీద తలస్నానం! -
వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: అకాలవర్షాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలయ్యపల్లి మండలం గొల్లపల్లి సమీపంలో నేరాడ కాలువ పొంగిపొర్లడంతో వరద నీరు భారీగా రోడ్డుపైకి చేరింది. దీంతో ఆ రహదారిలో వెళ్లుతున్న ఓ ఆటో వరదనీటిలో చిక్కుకుంది. అందులో ఓ పాపతో పాటు మరో నలుగురు భయంతో రక్షించమంటూ కేకలు పెట్టారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఆటోలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.