వైరల్‌ వీడియో: ఆ ఫోజుకు సిగ్గుపడి.. వరుడిని కొలనులో​ తోసేసింది

Viral: Bride Pushing Groom Photographer Into Water Leaves Netizens Laughs - Sakshi

ప్రస్తుతం పెళ్లంటే వ‌ధూవ‌రుల ఫొటోషూట్‌ కంపల్సరీగా మారింది. ఇక వీటి కోసం ఎవ‌రి అభిరుచికి తగ్గట్లు వారు లొకేష‌న్‌ల ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొం‍దరు అడ‌వుల‌ను, ఆకాశాన్ని కూడా వెడ్డింగ్ ఫొటోషూట్‌ల‌కు వాడేసుకుంటున్నారు. కొందరు మితిమీరిన పైత్యానికి పోయి సోషల్‌ మీడియాలో ట్రోల్‌ కాగా, మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోషూట్‌ జరుగుతుండగా పలు సందర్భాల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవల ఆ తరహా వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటిదే మ‌రో వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అందులో ఓ కొల‌ను మ‌ధ్య‌లో ఉన్న‌ వేదిక‌పై వెడ్డింగ్ ఫొటోషూట్ జ‌రుగుతోంది. ఆ ఫొటోగ్రాఫ‌ర్ వ‌ధూవ‌రుల‌ను రకరకాల ఫోజుల‌లో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఫోటోగ్రాఫర్‌కి ఓ ఫోజు గుర్తించింది. అది వ‌ధూవ‌రులిద్ద‌రూ ఒక‌రినొక‌రు అల్లుకుని నిల‌బ‌డాల్సిన రొమాంటిక్ ఫోజు. ఇంకేముంది వెంటనే ఎలా నిలబడాలో వివరించడానికి వరుడి దగ్గరగా వెళ్లి చేసి చూపిస్తున్నాడు.  అది చూసిన వ‌ధువు సిగ్గు ఆపుకోలేక‌పోయింది. ఫొటోగ్రాఫ‌ర్‌ను, వ‌రుడిని ఇద్ద‌రినీ క‌లిపి కొల‌ను నీళ్ల‌లోకి తోసేసింది. వాళ్లిద్ద‌రూ నీళ్ల‌లోప‌డిపోగానే ప‌గ‌ల‌బ‌డి న‌వ్వకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top