Kamala Harris: మోసగాళ్లను ఓడించాలి | USA Presidential Elections 2024: Kamala Harris Attacks Donald Trump Over Fear And Hate In First Campaign Rally | Sakshi
Sakshi News home page

Kamala Harris: మోసగాళ్లను ఓడించాలి

Jul 25 2024 5:32 AM | Updated on Jul 25 2024 1:28 PM

USA Presidential Elections 2024: Kamala Harris Attacks Donald Trump Over Fear And Hate In First Campaign Rally

ట్రంప్‌పై విమర్శల వర్షం

వాషింగ్టన్‌: ట్రంప్‌ లాంటి అవినీతిపరులను, ద్రోహులను ఎన్నికల పోరాటంలో మట్టికరిపించడమే తన ధ్యేయమని రిపబ్లికన్‌ అభ్యర్థిగా దాదాపు ఖరారైన కమలా హారిస్‌ ఉద్ఘాటించారు. మంగళవారం విస్కాన్సిన్‌ రాష్ట్రంలో డెమోక్రటిక్‌ పార్టీ సమావేశంలో ఆమె తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అభ్యర్థిత్వానికి సరిపడా మద్దతు కూడగట్టుకున్నాక కమల మాట్లాడిన మొదటి సమావేశం ఇదే.  

గతంలో కాలిఫోరి్నయా ప్రాసిక్యూటర్‌గా పనిచేశానని, తన రికార్డు ఏమిటో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను వేధించిన దుర్మార్గులను, అమాయక ప్రజలను దగా చేసిన మోసగాళ్లను, సొంత లాభం కోసం నిబంధనలు అతిక్రమించిన దుషు్టలను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా, డెమొక్రటిక్‌ అభ్యర్థిగా తొలుత బరిలోకి దిగిన బైడెన్‌కు ప్రజల నుంచి వచి్చన విరాళాలను హారిస్‌కు బదిలీ చేయడం ఆపాలని ట్రంప్‌ ప్రచార బృందం కోరింది. ఈ మేరకు ఫెడరల్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

సర్వేల్లో హారిస్‌దే పైచేయి
లేటుగా వచ్చినా, లేటెస్ట్‌గా వచ్చారన్న నానుడిని హారిస్‌ నిజం చేస్తున్నారు. అధ్యక్ష రేసులో బైడెన్‌పై ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన ట్రంప్‌ జోరుకు ఆమె వచ్చీ రాగానే కళ్లెం వేశారు. మానసిక చురుకుదనం, సవాళ్లను దీటుగా ఎదుర్కోగల సత్తా విషయంలో ట్రంప్‌ కంటే హారిస్‌కే అమెరికన్లు జైకొట్టడం విశేషం! ఈ విషయమై రాయిటర్స్‌/ఇప్సోస్‌ చేసిన తాజా సర్వేలో 56 శాతం మంది హారిస్‌కు ఓటేయగా ట్రంప్‌కు 49 శాతమే దక్కాయి. తాజాగా సోమ, మంగళవారాల్లో సీఎన్‌ఎన్‌ జరిపిన దేశవ్యాప్త సర్వేలో కూడా ట్రంప్‌కు 49 శాతం రాగా, హారిస్‌ 46 శాతం ఓట్లు సాధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement