అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ | US Supreme Court strikes down Trump order restricting birthright citizenship | Sakshi
Sakshi News home page

అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

Jun 30 2026 8:59 PM | Updated on Jun 30 2026 9:14 PM

US Supreme Court strikes down Trump order restricting birthright citizenship

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డకు లభించే సహజ సిద్ధమైన ‘బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ (పుట్టుకతో వచ్చే పౌరసత్వం) హక్కును రద్దు చేస్తూ ట్రంప్ గతంలో జారీ చేసిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పు అమెరికాలో స్థిరపడిన లక్షలాది మంది భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు,ప్రవాస భారతీయ కుటుంబాలకు ఊరటనిచ్చింది.

అమెరికా భూభాగంపై జన్మించే పిల్లలకు రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభిస్తుందని, దీనిని మార్చే అధికారం అధ్యక్షుడి ఉత్తర్వులకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ వలసలను అడ్డుకునే పేరుతో, తాత్కాలిక వీసాలపై (హెచ్‌1బీ వీసా) ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా పౌరసత్వం రద్దు చేయాలన్న ట్రంప్ యత్నాలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది.

భారతీయులకు ఎందుకు బిగ్ రిలీఫ్?
అమెరికాలో గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఒకవేళ ట్రంప్ తెచ్చిన ఆర్డర్ అమలులోకి వచ్చి ఉంటే.. అమెరికాలో పుట్టే భారతీయుల పిల్లలకు పౌరసత్వం లభించేది కాదు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో భారతీయ దంపతులకు అమెరికాలో పుట్టే పిల్లల పౌరసత్వానికి ఎలాంటి ఢోకా లేదని తేలిపోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement