జింకకు కరోనా వైరస్.. అమెరికాలో తొలి కేసు నమోదు.. | Sakshi
Sakshi News home page

World First Deer With Covid 19: జింకకు కరోనా వైరస్.. అమెరికాలో తొలి కేసు

Published Sat, Aug 28 2021 9:02 PM

US Reports First Covid 19 Case In A Deer - Sakshi

న్యూయార్క్: మనుషుల్లో మాత్రమే కనిపించిన కరోనా మహమ్మారి తీవ్రత జంతువుల్లోనూ మొదలైంది. తొలి సారిగా జింకకు కరోనా వైరస్‌ సోకింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ నివేదించింది. జింకకు కరోనా వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తేలలేదని అమెరికా ప్రతినిధి లిండ్సే కోల్ తెలిపారు.

మనుషుల ద్వారా,  ఇతర జింకలు, మరొక జంతు జాతుల ద్వారా  వైరస్ సోకి ఉంటుందని తాము అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 ఉన్న వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్న జంతువులకు కరోనా సోకిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ కొనసాగిస్తున్న అధ్యయనాలలో భాగంగా జింకకు కొవిడ్-19 వైరస్ సోకినట్లు బయటపడింది. గతంలో కుక్కలు, పిల్లులు, సింహాలు, చిరుత పులులు, గొరిల్లాలకు  కరోనా వైరస్ సోకిందిజ

చదవండి: Kerala: కరోనా విజృంభణ, కీలక నిర్ణయం

Advertisement

తప్పక చదవండి

Advertisement