40 డాలర్ల బిల్లుకు 16 వేల డాలర్లు టిప్పు..

Customer leaves-tip-400-times-bigger-than-price  - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలకుతలం చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రకాల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా పుఢ్‌ ఇండస్ట్రీ బాగా నష్టపోయింది. కొవిడ్‌ నిబంధనలు,లాక్‌డౌన్‌ నియామాలు వల్ల రెస్టారెంట్లు అస్సలు తెరుచుకోలేదు. కరోనా కాస్త తగ్గు ముఖం పట్టడం వల్ల ఇప్పుడిప్పుడే రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ ముగియడం వలన అంతా పనులులోకి వచ్చేశారు.

రెస్టారెంట్లులో పనిచేసే వారికి ఒక 50రూపాయలు టిప్‌ ఇస్తే ఎంతో ఆనందంగా ఫీల్‌ అవుతారు. అటువంటిది ఏకంగా 16000వేల డాలర్లు టిప్ గా వస్తే.. ఎలా ఫీల్‌ అయివుంటారో మీరే ఆర్ధం చేసుకోవాలి. అమెరికాలోని ఓ రెస్టారెంట్లో కస్టమర్ తాను చేసిన బిల్ 40డాలర్ల కంటే తక్కువే అయినా.. 16000వేల డాలర్లు టిప్ గా ఇచ్చి స్టాఫర్ ను ఆనందానికే కాకుండా ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

బిల్లుతో పాటు క్రెడిట్‌ కార్డు తీసుకున్న స్టాఫర్ అది చూసి ఒక్కసారి షాక్ అయింది. కస్టమర్ ఏదో పొరబాటు చేశాడని అతను  దగ్గరకు వెళ్లి.. ‘‘ఓమైగాడ్‌.. ఇది నిజమా అని అడిగింది.. దానికి రెస్పాన్స్ ఇస్తూ.. అవును ఇది మీ కోసమే .మీరు చాలా కష్టపడుతున్నారంటూ బదులిచ్చాడు.. ఆ టిప్ ను ఆ షిఫ్ట్ లో వాళ్లే కాకుండా మొత్తం ఉద్యోగులంతా పంచుకున్నాం’’ అని స్టాఫర్ చెప్పింది.
చదవండి:ఒకే కాన్పులో పదిమంది.. అంతా కట్టుకథ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top