ఉక్రెయిన్‌లో నిరసనల వేళ జెలెన్‌స్కీ కీలక నిర్ణయం | ukraines zelensky sacks army chief amid war | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో నిరసనల వేళ జెలెన్‌స్కీ కీలక నిర్ణయం

Jul 22 2026 3:18 AM | Updated on Jul 22 2026 11:58 AM

ukraines zelensky sacks army chief amid war

కీవ్: రష్యాతో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్‌స్కీ  సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్‌ ఒలెక్సాండర్ సిర్స్కీని పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే  రక్షణ మంత్రి తొలగింపుతో చెలరేగిన రాజకీయ సంక్షోభం తర్వాత ఆర్మీ చీఫ్‌ను తొలగిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మిలిటరీని ఆధునీకరించే తన సంస్కరణలను అడ్డుకున్నారని, తనను పదవి నుంచి తొలగించేలా చేశారని ఫెడోరోవ్ , ఆర్మీ చీఫ్‌పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అంతటా నిరసనలు చెలరేగాయి.  ఈ వివాదం తీవ్రం కావడంతో జెలెన్‌స్కీ సిర్స్కీపై వేటు వేశారు.

ఆయన స్థానంలో నూతన కమాండర్-ఇన్-చీఫ్‌గా మైఖైలో డ్రాపతీని నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. జెలెన్‌స్కీ మాట్లాడుతూ  "ఉక్రెయిన్ సాయుధ దళాల నూతన కమాండర్-ఇన్-చీఫ్‌గా మైఖైలో డ్రాపతీని నియమించాలని నేను నిర్ణయించుకున్నాను. ఉక్రెయిన్  బలమైన ఫ్రంట్‌లైన్ స్థానాల కోసం ఒలెక్సాండర్ సిర్స్కీకి  మన ప్రతీ యోధుడికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు

కేవలం ఆరు నెలల క్రితమే రక్షణ మంత్రిగా నియమితులైన, ఎంతో ప్రాచుర్యం పొందిన ఫెడోరోవ్‌ను జెలెన్‌స్కీ గత వారం అకస్మాత్తుగా తొలగించడంతో సిర్స్కీ భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలయ్యాయి.

35 ఏళ్ల ఫెడోరోవ్ ఉక్రెయిన్ సైన్యాన్ని ఆధునీకరించడానికి చేసిన ప్రయత్నాలు సైనిక నాయకత్వంతో విభేదాలకు దారితీశాయి. సిర్స్కీ తన ఆలోచనలను అడ్డుకున్నారని, తనను తొలగించేలా జెలెన్‌స్కీపై ఒత్తిడి తెచ్చారని ఫెడోరోవ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సిర్స్కీ ఖండించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సిర్క్సీపై సైతం వేటు పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement