పశ్చిమాసియా మరింత ఉద్రిక్తం | ukraine sends advisers to gulf as it counterattacks russian forces | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా మరింత ఉద్రిక్తం

Mar 20 2026 8:06 PM | Updated on Mar 20 2026 9:19 PM

 ukraine sends advisers to gulf as it counterattacks russian forces

పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్‌ దేశాలకు రక్షణగా ఉక్రెయిన్ నేరుగా రంగంలోకి దిగింది. ఆ దేశానికి చెందిన 200 మందికి పైగా నిపుణుల బృందాన్ని సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యుఏఈ దేశాలకు పంపింది. త్వరలోనే మరికొంత మందిని అక్కడికి పంపుతామని జెలెన్‌ స్కీ ప్రకటించారు.  

పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌ను ఇరాన్‌కు చెందిన షాహిద్ డ్రోన్లు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. 30$ఖర్చుతో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా దాదాపు 3.7 $ మిలియన్లు ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన అతితక్కువ ఖరీదైన డ్రోన్లతో వీటిని అడ్డుకుంది. ఈనేపథ్యంలో కీవ్ సాయం కోసం గల్ఫ్ దేశాలు ఎదురుచూస్తున్నాయి. 

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ" ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం మాకు దూరమైందేమి కాదు. రష్యా, ఇరాన్‌కు సహకరిస్తున్నందున ఈ యుద్ధంలో ఉదాసీనంగా ఉండే హక్కు మాకుందని మేము భావించడం లేదు. అని కొద్దిరోజుల క్రితం లండన్‌ పార్లమెంటులో జెలెన్‌స్కీ మాట్లాడారు. కాగా అంతకు ముందే ఉక్రెయిన్‌పై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ శత్రు దేశాలకు సహకరిస్తోన్న ఉక్రెయిన్‌ పై నేరుగా దాడి చేస్తామని హెచ్చరించింది. అమెరికాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించింది. అయితే వీటిని జెలెన్‌స్కీ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది.


షాహిద్ డ్రోన్ల ప్రత్యేకత

షాహిద్  డ్రోన్లను  ఇరాన్  తయారు చేస్తుంది. ఆ దేశానికి చెందిన 'షాహిద్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ ,ఇరాన్ విమానయాన పరిశ్రమల సంస్థ (HESA) వీటిని సంయుక్తంగా వీటిని రూపొందిస్తాయి.  'సూసైడ్' డ్రోన్లుగా ఇవి ప్రసిద్ధి చెందిన ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. లక్ష్యాన్ని చేరుకున్నాక వాటంతట అవే పేలిపోతాయి.

అయితే రష్యా సైతం ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇదే తరహా డ్లోన్లను రూపొందించింది. దీంతో వీటిని అడ్డుకునేలా ఉక్రెయిన్‌ తన సాంకేతికతను ఏర్పాటు చేసుకుంది. ఇదివరకూ ఉక్రెయిన్ 44,700కు పైగా షాహెద్ తరహా డ్రోన్‌లను కూల్చివేసింది. కేవలం గత నెలలోనే దాదాపు 3,238 షాహెద్ తరహా డ్రోన్‌లను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డ్రోన్ల దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న గల్ఫ్ దేశాలని రక్షించడానికి ఉక్రెయిన్ ఒప్పుకుంది. అయితే వీటికోసం జెలెన్‌స్కీ తగిన మెుత్తంలో డబ్బు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement