ఉక్రెయిన్‌ దాడులు.. రష్యాలో ఇంధన సంక్షోభం | Ukraine Drone-Attacks On Russia Oil Refineries Leads To-Crisis | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ దాడులు.. రష్యాలో ఇంధన సంక్షోభం

Jul 1 2026 2:16 AM | Updated on Jul 1 2026 3:58 AM

Ukraine Drone-Attacks On Russia Oil Refineries Leads To-Crisis

రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు కొనసాగుతున్న వేళ దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ జోక్యం అవసరమని పేర్కొన్నది. మరోవైపు వేసవి ప్రయాణాలు, పంట కోతల తరుణంలో గ్యాసోలైన్‌, డీజిల్‌కు డిమాండ్‌ పెరుగుతున్నది. 

దీంతో ఇంధనం గురించి ఆందోళన అక్కర్లేదన్న ప్రకటన నుంచి ఇంధన సరఫరాలో సంక్షో భం ఉందని దేశాధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించే స్థాయికి పరిస్థితి దిగజారింది. రాజధాని మాస్కోలోనూ ఇంధన కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో గతవారం ప్రభుత్వ, చమురు కంపెనీల ఉన్నతాధికారులతో పుతిన్‌ సమావేశమై పరిష్కారం గురించి చర్చించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement