ట్రంప్‌ బ్యాన్‌ : ట్విటర్‌ నష్టం ఎంతో తెలుసా? 

Twitter loses usd 5 billion in market value after Trump account ban - Sakshi

5 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి

ట్రంప్‌కు ట్విట్టర్‌ మరో షాక్‌

70వేల మద్దతుదారుల అకౌంట్ల తొలగింపు  

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌ ఖాతాను శాశ్వతంగా తొలగించిన సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌కు  ఎదురు  దెబ్బ తగిలింది. ట్రంప్‌పై నిషేధం ప్రకటించిన తరువాత ట్విటర్‌ షేర్‌ సోమవారం 12 శాతం కుప్పకూలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్  5 బిలియన్ డాలర్లు ఆవిరై పోయింది. మరోవైపు ఇప్పటికే ట్రంప్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేసినసంస్థ తాజాగా మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ మద్దతుదారులకు చెందిన సుమారు 70వేల అకౌంట్లను నిలిపి వేసింది. సుమారు  ట్విటర్‌లో 88 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ట్రంప్‌  సొంతం. (బైడెన్‌ ప్రమాణస్వీకారం.. ఎమర్జెన్సీ విధించిన ట్రంప్‌)

వాషింగ్టన్‌, డీసీలో హింసాత్మక సంఘటనలు కొనసాగే ప్రమాదం ఉన్నందున క్యాపిటల్‌ ఘటనకు సంబంధించిన కంటెంట్‌ను షేర్‌ చేస్తున్న వేలాది ఖాతాలను శుక్రవారం నుంచి శాశ్వతంగా నిలివేస్తున్నట్లు ట్విటర్‌ సోమవారం ఆలస్యంగా తన బ్లాగ్‌లో వెల్లడించింది  నిశిత పరిశీలన అనంతరం 70వేల ఖాతాలను ఆపివేసినట్టు చెప్పింది. గతవారం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్‌ క్యాపిటల్‌లో అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైన సమయంలో ట్రంప్‌ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఏకంగా క్యాపిటల్‌ భవనంలోకి దూసుకువచ్చి వీరంగం వేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికిముందు ట్రంప్‌ తన మద్దతుదారులనుద్దేశించివరుస ట్వీట్లు చేశారు. దీంతో ట్రంప్‌ అధికారిక ఖాతాను ట్విటర్‌ శాశ్వతంగా ​ నిషేధించింది. ట్రంప్‌ ట్వీట్లు హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉందని భావించిన ట్విటర్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మరో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కూడా ట్రంప్‌ అనుకూల పోస్టులపై చర్యలు చేపట్టింది. తమ నిబంధనలు ఉల్లంఘించే ఎలాంటి పోస్టులనైనా తొలగిస్తామని, హింసను ప్రేరేపించే తప్పుడు సమాచార వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.  (పోర్న్‌ వీడియో? ట్విటర్‌​ తప్పులో కాలు )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top