ఫ్రీజ్‌ చేసిన ఇరాన్‌ ఆస్తులపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు | Trump says Iranian assets to be unfrozen only after deal, Lebanon not part of pact | Sakshi
Sakshi News home page

ఫ్రీజ్‌ చేసిన ఇరాన్‌ ఆస్తులపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Jun 7 2026 9:33 PM | Updated on Jun 7 2026 9:33 PM

Trump says Iranian assets to be unfrozen only after deal, Lebanon not part of pact

వాషింగ్టన్‌: పశ్చిమాసియా యుద్ధంలో తాము విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయబోమని, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే, లెబనాన్‌ను ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగం చేయాలనే ఆలోచన లేదన్నారు.

ఎన్‌బీసీ న్యూస్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్నారు. ఒప్పందంపై మాకు నమ్మకం కలగాలి. అప్పుడే ఆంక్షలపై చర్చలు ప్రారంభమవుతాయి. ఒప్పందం కుదిరే వరకు ఆస్తులను నిలిపివేస్తామని స్పష్టం చేస్తూ.. ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచారు. ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రస్తుతం లెబనాన్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాయి.

ఇరాన్‌తో అమెరికా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు, దాడులు, రాజకీయ అస్థిరతలు ఈ చర్చలకు మరింత క్లిష్టతరం చేశాయి.ట్రంప్ వ్యాఖ్యలు ఒప్పందం విషయంలో అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement