మాజీ అధ్యక్షులందరితో రీయూనియన్‌ | Trump moots reunion of presidents at White House | Sakshi
Sakshi News home page

మాజీ అధ్యక్షులందరితో రీయూనియన్‌

Jul 5 2026 5:18 AM | Updated on Jul 5 2026 5:18 AM

Trump moots reunion of presidents at White House

డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచన 

ఉషా వాన్స్‌ పాడ్‌కాస్ట్‌లో వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికా పూర్వ అధ్యక్షులందరితో వైట్‌హౌస్‌లో రీ యూనియన్‌ పార్టీ ఏర్పాటు చేయాలని ఆశగా ఉందని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. బరాక్‌ ఒబామా, జో బైడెన్‌సహా అందరు పూర్వ అధ్యక్షులతో కలిసి వైట్‌హౌస్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తే బాగుంటుందని ఆయన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి ఉషా వాన్స్‌తో నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.

అమెరికా 250వ స్వాతంత్య్ర ఉత్సవ వేడుకల్లో భాగంగా ‘‘స్టోరీ టైమ్‌ విత్‌ సెకెండ్‌ లేడీ’ పేరుతో ఈ పాడ్‌కాస్ట్‌ను నిర్వహించారు. ఇందులోనే డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌ హిస్టారికల్‌ అసోసియేషన్‌ ప్రచురించిన ‘ప్రేసిడెంట్స్‌ ప్లే’ పుస్తకంలో కొంత భాగాన్ని చదివి వినిపించారు. బహిరంగ సభలు, విలేకరుల సమావేశాల్లో  ఒబామా, బైడెన్‌లను విమర్శించే అవకాశాన్ని ఏనాడూ వదులుకోని ట్రంప్‌ వారితో కలిసి సూపర్‌ బౌల్‌ మ్యాచ్‌ చూసేందుకు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వాలన్న ఆలోచన ఉషా వాన్స్‌దేనని వెల్లడించారు.

‘‘బరాక్‌ ఒబామా, జో బైడెన్‌లతోపాటు బుష్‌లను ఆహ్వానించాలనుకుంటా. బహుశా వీరిలో కొందరినైనా ఆహ్వానించి వారితో కలిసి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడాలి. ఇదే మంచి స్టోరీ అవుతుంది కదా?. మీడియాకు పిచ్చెక్కుతుంది. అధ్యక్షుల రీ యూనియన్‌ అంటే సరదాగానూ ఉంటుంది’’ అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement