Titanic Submarine Disaster: ‘టైటాన్‌ మునుగుతుందని ముందే చెప్పా’.. అందుకే జాబ్‌ నుంచి పీకేశారు!

Titan Submarine Missing, Company Fired Director Raising Concerns About  Vessel - Sakshi

అట్లాంటిక్ మహా సముద్రంలో ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో ఓషన్ గేట్ యజమాని సహా ఐదుగురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. టైటానిక్ ఓడ శిథిలాల ఉన్న చోటుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన టైటాన్ జలాంతర్గామి నిర్మాణ సమయంలోనే అందులో లోపాలు ఉన్నట్లు ఓ నిపుణుడు గుర్తించాడు. ఈ విషయాన్ని యాజమాన్యం వద్దకు తీసుకెళ్లగా.. వారు ఆయన మాటలను వినిపించుకోలేదు. పైగా లోపాలను చెప్పిన ఆ నిపుణుడిని ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. 

అసలేం జరిగిందంటే..
‘టైటాన్’ జలాంతర్గామి నిర్మాణ జరుగుతుండగా… దాని సామర్థత మీద ఆ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఓ నిపుణుడికి సందేహాలు మొదలయ్యాయి. దాంతో టైటాన్‌కు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి అవసరం ఉందని, నౌక తీవ్రమైన లోతులకు చేరినప్పుడు ప్రయాణికులకు ముప్పు తలెత్తే అవకాశముందని 2018లోనే ‘ఓషన్ గేట్’ సంస్థ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ తన నివేదికలో విశ్లేషించాడు. దీనిపై అప్పట్లో అమెరికాలోని సియాటెల్ జిల్లా కోర్టులో వ్యాజ్యం సైతం దాఖలైంది.

కంపెనీ విషయాలను బహిర్గతం చేస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ ఆ నిపుణుడు మీద ‘ఓషన్ గేట్’ సంస్థ వ్యాజ్యం వేసింది. మరో వైపు ‘టైటాన్’ భద్రత గురించి, దాని లోపాలు ఎత్తిచూపానని, పరీక్షల గురించి ప్రశ్నించినందుకు తనను ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారంటూ సదరు వ్యక్తి కూడా కౌంటర్ దాఖలు చేశాడు. కంపెనీ ఆ రోజే నిర్మాణంలో నాణ్యత, భద్రత విషయంలో శ్రద్ధ చూపించి ఉంటే ఐదుగురు ప్రాణాలు గాల్లో కలిసేవి కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

చదవండి: ప్రయాణం.. విషాదాంతం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top