పాలస్తీనా ఉగ్రవాదుల ఏరివేత.. ఇజ్రాయెల్‌ భారీ సైనిక ఆపరేషన్‌ | Thousands of Palestinians flee Jenin refugee camp after major Israeli raid | Sakshi
Sakshi News home page

పాలస్తీనా ఉగ్రవాదుల ఏరివేత.. ఇజ్రాయెల్‌ భారీ సైనిక ఆపరేషన్‌

Jul 5 2023 5:05 AM | Updated on Jul 5 2023 10:31 AM

Thousands of Palestinians flee Jenin refugee camp after major Israeli raid - Sakshi

జెనిన్‌: శరణార్థుల శిబిరాల్లో మాటు వేసిన పాలస్తీనా ఉగ్రవాదులను ఏరివేయడం, వారి ఆయుధాలను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌ శరణార్థుల క్యాంప్‌లో సోమవారం నుంచి విస్తృతంగా సోదాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సైతం దాడులు కొనసాగాయి. దీంతో వేలాది మంది పాలస్తీనా శరణార్థులు సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు.

దాదాపు 4,000 మంది పాలస్తీనా శరణార్థులు బయటకు వెళ్లిపోయారని జెనిన్‌ నగర మేయర్‌ నిడాల్‌ అల్‌–ఒబిడీ చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. వారంతా ఉగ్రవాదులేనని ఇజ్రాయెన్‌ సైన్యం చెబుతున్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు. పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నామని, జెనిన్‌ క్యాంప్‌లో మసీదు కింద ఉన్న సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. జెనిన్‌ క్యాంప్‌లో ఈ స్థాయిలో సైనిక ఆపరేషన్‌ జరుగుతుండడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్‌ వాసులపై ఇటీవలి కాలంలో దాడులు జరుగుతున్నాయి.

గతనెలలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అంతేకాకుండా పాలస్తీనా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూపై అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది. తమ పౌరులకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదులను ఏరివేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌ దాడులను వ్యతిరేకిస్తూ వెస్ట్‌బ్యాంక్‌లు పాలస్తీనా పౌరులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

జెనిన్‌ సిటీపై పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదులకు గట్టిపట్టుంది. వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్‌ను 1967లో జరిగిన యుద్ధంలో పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్‌ స్వా«దీనం చేసుకుంది. వాటిని తిరిగి తమకు అప్పగించాలని పాలస్తీనా డిమాండ్‌ చేస్తోంది.  
ఇజ్రాయెల్‌ సైనిక వాహనం వద్ద బాంబు పేలుడు దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement