అత్యంత భారీ వరదలు.. హవాయి అతలాకుతలం | Thousands evacuated as Hawaii faces worst flooding in 20 years | Sakshi
Sakshi News home page

అత్యంత భారీ వరదలు.. హవాయి అతలాకుతలం

Mar 22 2026 3:53 AM | Updated on Mar 22 2026 3:54 AM

Thousands evacuated as Hawaii faces worst flooding in 20 years

అమెరికా రాష్ట్రం హవాయి గత రెండు దశాబ్దాల్లో అత్యంత భారీ వరదలను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఈ ప్రాంతం అతలాకుతలమైంది. వేలాది మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఓహావు దీవిలోని ఓ ఆనకట్ట కూలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులు గంటకు 100 మైళ్ల వేగంతో వీచాయి. 

ఈ వరదలను గడిచిన 20 ఏళ్లలో అత్యంత భారీ వరదలుగా అధికారులు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. విమానాశ్రయాలు, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. 

కోనాలో అనే తక్కువ ఒత్తిడి వాతావరణ వ్యవస్థ కారణంగా ఈ వరదలు సంభవించాయని గుర్తించారు. ఇది హవాయి దీవులపై తేమతో నిండిన గాలులను లాగి, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను తెచ్చింది. హోనలూలు అత్యవసర నిర్వహణ విభాగం మరిన్ని ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. మావి, మోలోకై, బిగ్ ఐలాండ్‌లకు కూడా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. 

రహదారులు మూసివేయబడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఈ వరదల కారణంగా ఇప్పటికే బిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించిదని అంచనా. 2023లో లహైనా అగ్నిప్రమాదాల తర్వాత, ఇప్పుడు వరదలతో హవాయి మరోసారి ప్రకృతి విపత్తు భారాన్ని మోస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement