వైరల్: అమ్మో..పాము ఎంత భయంకరంగా దాడిచేసింది!

Terrifying Video: Huge Snake Attack On Californian Zookeeper Goes Viral - Sakshi

కాలిఫోర్నియా: జూలో ఉన్న జంతువులు ఒక్కోసారి తమ యజమానులపైన దాడిచేయడం మనం చూస్తునే ఉంటాం. అయితే తాజాగా, ఒక పెద్ద పాము తన జూకీపర్‌పైన దాడిచేసింది. ఈ సంఘటన కాలిఫోర్నియాలోని జూలో చోటు చేసుకొంది. వివరాలు.. కాలిఫోర్నియాలోని జూలో పనిచేస్తున్న మిస్టర్‌ బ్రీవర్‌కు పాములను పట్టుకోవడమంటే మహసరదా. ఇప్పటి వరకు రకరకాల పాములను పట్టుకున్నాడు. పాములను మెడలో వేసుకొని, వాటి మధ్యలో కూర్చున్న అనేక ఫోటోలు, వీడియోలు తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటాడు. అయితే,  బ్రీవర్‌ ఓ రోజు చేతిలో స్టిక్‌ పట్టుకొని , టేబుల్‌ పైన ఉన్న పెద్ద పాము వద్దకు వెళ్లాడు. దాన్ని కర్రతో తాకుతూ ఏదో మాట్లాడుతున్నాడు.

ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ పాము బ్రీవర్‌ను  కరవడానికి ముందుకు దూకింది. దీంతో షాక్‌కు‌ గురైన అతను‌ వెంట్రుకవాసిలో దాని కాటునుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే దీన్ని చూసిన నెటిజన్లు ‘నువ్వు అదృష్టవంతుడివి,  దాదాపు నీ ముఖాన్ని పాము పట్టేసుకొంది, వెంట్రుకవాసిలో తప్పించుకున్నావు’ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.

చదవండి: వైరల్‌: విషనాగును ఒంటి చేత్తో పట్టుకొన్న మహిళ
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top