Russia Ukraine War: రేడియో స్టేషన్‌పై రష్యా కన్నెర్ర

Russias Liberal Echo Mosque Radio Station Stopped Broadcasting - Sakshi

మాస్కో: రష్యాలోని ఉదారవాద ఎకో మాస్కీ రేడియో స్టేషన్‌పై అధికారులు కన్నెర్ర జేశారు. దీంతో ప్రసారాలు నిలిపివేస్తున్నామని గురువారం రేడియో స్టేషన్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అలెక్సీ వెనిడిక్టోవ్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై పలు కీలక కథనాలను ఈ రేడియో ప్రసారం చేసింది. దీంతో తమపై అధికారులు గుర్రుగా ఉన్నట్లు ముందే తెలిసిందని అలెక్సీ చెప్పారు. ఈ నేపథ్యంలో రేడియో ఛానెల్‌ను, వెబ్‌సైట్‌ను మూసేయాలని  నిర్ణయించామన్నారు.

ఉక్రెయిన్‌పై కథనాలకుగాను ఎకో మాస్కీతో పాటు రైన్‌ టీవీని మూసేయాలని గతంలో రష్యా ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం డిమాండ్‌ చేసింది. వీటి మూసివేత మీడియా స్వేచ్ఛను హరించడమేనని అమెరికా దుయ్యబట్టింది. నిజాలు చెప్పడాన్ని రష్యా సహించలేకపోయిందని విమర్శించింది. ఇప్పటికే ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై రష్యా నియంత్రణలు విధించింది. తమది దురాక్రమణ కాదని, కేవలం ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడమే ఉద్దేశమని రష్యా పేర్కొంది. ఇకపై రష్యాలో ఫేక్‌ న్యూస్‌ ప్రసారం చేస్తే 15 ఏళ్ల జైలుశిక్ష విధించేందుకు చర్యలు ప్రారంభించింది. 

(చదవండి: అగ్రరాజ్యానికి షాక్‌ ఇచ్చిన రష్యా!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top