Russian Troops Attacks On Nuclear Power Plant At Zaporizhzhia, Official Says - Sakshi
Sakshi News home page

Nuclear Power Plant: భారీ విధ్వంసానికి రష్యా ప్లాన్‌.. ఆందోళనలో ఐరోపా దేశాలు..!

Mar 4 2022 11:29 AM | Updated on Mar 4 2022 11:48 AM

Russian Troops Attacks On Nuclear Power Plant At Zaporizhzhia - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. నేటితో 9వ రోజుకు చేరుకున్నరష్యా సైనిక దాడులు శుక్రవారం పీక్‌ స్జేజ్‌కు చేరుకున్నాయి. తొమ్మిదొవ రోజు రష్యా బలగాలు యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ అయిన జాపోరిజ్జియా న్యూక్లియర్‌ప్లాంట్‌ను టార్గెట్‌ చేసి రాకెట్‌ దాడులు జరిపాయి.దీంతో ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విషయాన్నిఎనర్‌గోదర్ పట్టణ మేయర్ దిమిత్రో ఓర్లోవ్ ధృవీకరించారు. ఆ సమయంలో వెంటనే అప్రమత్తమైన ప్లాంట్‌ సిబ‍్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణా నష్టం జరగలేదని ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా న్యూక్లియర్‌ ప్లాంట్‌పై దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు స్పందించారు. యూకే ప్రధానరి బోరిస్‌ జాన్సన్‌.. శుక‍్రవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిర్లక్ష్య చర్యలు, దాడులు ఐరోపా భద్రతకు సవాళ్లు విసురుతున్నాయన్నారు. వారి చర్యలు ఐరాపాకు తీవ్ర నష్టం కలిగించేలా, భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు.. న్యూ క్లియర్‌ ప్లాంట్‌పై దాడిని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో సైతం ఖండించారు. జెలెన్‌ స్కీకి ఫోన్‌ చేసి మాట్లాడిన ట్రూడో.. ఈ సందర్భంగా అణు విద్యుత్‌ కేంద్రంపై దాడి రష్యాకు ఆమోద యోగ్యం కాదన్నారు. అక్కడ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. కాగా, జాపోరిజ్జియా న్యూక్లియర్‌ ప్లాంట్‌ యూరప్‌లోనే అతిపెద్ద ప్లాంట్‌. ఇది గనుక పేలితే చెర్నోబిల్‌ కంటే పదిరెట్లు నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement