20 వేలమందిని బఖ్‌ముత్‌లో కోల్పోయాం

Russian private army Wagner says more than 20,000 of his troops died in Bakhmut battle - Sakshi

రష్యా ప్రైవేట్‌ ఆర్మీ చీఫ్‌ వెల్లడి

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని బఖ్‌ముత్‌ నగరంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రైవేట్‌ సైన్యమైన ‘వాగ్నర్‌’ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌ సేనలతో జరిగిన పోరాటంలో 20,000 మందికిపైగా సైనికులను కోల్పోయామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రష్యా ప్రభుత్వం ఖైదీలకు, వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నవారికి కొంత శిక్షణ ఇచ్చి, ప్రైవేట్‌ సైన్యంగా మార్చి, ఉక్రెయిన్‌లో యుద్ధ రంగానికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. బఖ్‌ముత్‌లో గత తొమ్మిది నెలలుగా సాగుతున్న హోరాహోరీ యుద్ధంలో ఉక్రెయిన్‌ జవాన్లు ఎంతమంది మరణించారన్నది తెలియరాలేదు. దీనిపై ఉక్రెయిన్‌ సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పది వేల మందికిపైగానే ఉక్రెయిన్‌ సైనికులు మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top