రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యం విషమం: ‘ఏ క్షణంలోనైనా మృతి’

Russia Opposition Leader Doctor Says He Lost Breath At Any Moment - Sakshi

మాస్కో: రష్యా ప్రతిపక్ష నేత, అధ్యక్షుడు పుతిన్‌ విధానాలను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావల్నీ(44) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నావల్నీ మూడు వారాలుగా నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణిస్తోందని ఆయన వ్యక్తిగత వైద్యుడు యరోస్లావ్‌ అషిఖ్మిన్‌ వెల్లడించారు. ఆయన ఏ క్షణంలోనైనా తుదిశ్వాస విడిచే ప్రమాదముందన్నారు. కుటుంబసభ్యులు అందజేసిన నావల్నీ వైద్య పరీక్షల రిపోర్టులు పరిశీలిస్తే.. రక్తంలో పొటాషియం, క్రియాటినిన్‌ స్థాయిలు పెరిగిపోయాయనీ, ఇది గుండెపోటుకు, కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుందన్నారు.

కాగా విష ప్రయోగం అనంతరం జర్మనీలో 5 నెలలపాటు చికిత్స పొంది జనవరిలో స్వదేశం చేరుకున్న నావల్నీని అధికారులు అరెస్ట్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై కోర్టు ఆయనకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాననీ, కాళ్లలో స్పర్శ కోల్పోయానని వ్యక్తిగత వైద్యులు అనుమతించాలంటూ చేసిన నావల్నీ వినతిని జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు.

చదవండి: ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత: పుతిన్‌కు బైడెన్‌ ఫోన్ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top