
నాటో బెదిరింపు చర్యల కారణంగానే పశ్చిమాన ఉన్న ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి పెద్ద సంఖ్యలో బలగాలను తరలించామన్న రష్యా
వాషింగ్టన్/మాస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా బైడెన్.. ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి రష్యా పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను తరలించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా పుతిన్‌ను కోరారని వైట్‌హౌస్ తెలిపింది. నాటో బెదిరింపు చర్యల కారణంగానే పశ్చిమాన ఉన్న ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి పెద్ద సంఖ్యలో బలగాలను తరలించినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు.
చదవండి: గడ్డకడుతున్న రక్తం.. అమెరికాలో జాన్సన్ టీకా నిలిపివేత