మూడో దశ పరీక్షలకు సన్నద్ధం

Russia Expects To Produce Six Million Doses In Later Stage - Sakshi

వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాలకు ఏర్పాట్లు

మాస్కో : కోవిడ్‌-19 నిరోధానికి తొలి వ్యాక్సిన్‌ను ప్రకటించిన రష్యా భారీస్ధాయిలో వ్యాక్సిన్‌ తయారీకి సన్నద్ధమవుతోంది. సంవత్సరం చివరి నాటికి నెలకు 20 లక్షల డోసులను ఉత్పత్తి చేస్తూ క్రమంగా నెలకు 60 లక్షల డోసులకు సామర్ధ్యాన్ని పెంచుతామని పరిశ్రమల మంత్రి డెనిస్‌ మంతురోవ్‌ వెల్లడించారు. ఇక గమలేయా ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌పై వచ్చే వారం భారీస్ధాయిలో టెస్టింగ్‌ను చేపట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాలపై దృష్టిసారిస్తూనే కీలక క్లినకల్‌ ట్రయల్స్‌కూ సంసిద్ధమైంది.

రష్యా వ్యాక్సిన్‌ కేవలం రెండు దశలను మాత్రమే పూర్తి చేసిందని, అడ్వాన్స్‌డ్‌ ట్రైల్స్‌ (మూడో దశ ప్రయోగం) పూర్తి చేయలేదనే విమర్శల నేపథ్యంలో మూడో దశ పరీక్షలకు మాస్కో సన్నద్ధమైంది. మూడో దశలో 40,000 మంది వాలంటీర్లపై కరోనా టీకాను ప్రయోగించనున్నారని టీఏఎస్‌ఎస్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. అయితే కరోనాను ఎదుర్కొనేందుకు ర‌ష్యా 'స్పుత్నిక్' టీకాను ప్ర‌క‌టించినా, మూడో ద‌శ మాన‌వ ప్ర‌యోగాల‌కు సంబంధించిన స‌మాచారంపై స్ప‌ష్ట‌త లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్‌వో) ఆక్షేపించింది. డబ్ల్యూహెచ్‌ఓ అభ్యంతరాల నడుమ రష్యా టీకాపై వివిధ దేశాలు సందేహాలు వ్యక్తం చేశాయి.

చదవండి : ఆశలన్నీ ఆక్స్‌ఫర్డ్‌ టీకాపైనే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top