రావలకోట్‌లో రగడ.. 150 మంది మృతి? | Rawalakot Erupts Reports Claim 150 Killed in PoK | Sakshi
Sakshi News home page

రావలకోట్‌లో రగడ.. 150 మంది మృతి?

Jun 9 2026 4:54 AM | Updated on Jun 9 2026 5:02 AM

Rawalakot Erupts Reports Claim 150 Killed in PoK

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావలకోట్‌ (Rawalakot) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) కార్యకర్తలు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో జేఏఏసీకు చెందిన కొందరు వ్యక్తులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.

అయితే.. నిరసనకారులు మాత్రం భద్రతా బలగాలే తమపై బలప్రయోగం చేశాయని ఆరోపిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల్లో ఏడుగురు పౌరులు మరణించినట్లు పేర్కొన్నారు.

రావలకోట్‌ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం స్థానిక ప్రజలు, పాకిస్థాన్ పరిపాలన మధ్య పెరుగుతున్న అసంతృప్తి. ముఖ్యంగా విద్యుత్ చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, అభివృద్ధి లోపం, రాజకీయ హక్కులపై అసంతృప్తి వంటి అంశాలు ప్రజల్లో ఆగ్రహానికి దారితీసినట్లు సమాచారం.

ఇంటర్నెట్ సేవలు కూడా పరిమితయ్యాయని, ఈ కారణంగానే సమాచార ప్రసారం కూడా పరిమితమైందనే వాదనలు వెలువడుతున్నాయి. అందుకే ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు అనే విషయాలు అధికారికంగా వెలువడలేదు. కానీ ఈ ఉద్రిక్తతల్లో ఏకంగా 150 మంది మరణించినట్లు, చాలామంది గాయపడ్డారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement